Advertisement

నెల్లూరు హోటల్స్ లో తిన్నారో.. మీకు వాంతులే../ rides on nellore hotels - NDN News

నెల్లూరు హోటల్స్ లో తిన్నారో.. మీకు వాంతులే../ rides on nellore hotels - NDN News నెల్లూరు హోటల్స్ లో తిన్నారో.. మీకు వాంతులే..
నెల్లూరు హోటల్స్ పై కార్పోరేషన్ హెల్త్ ఆఫీసర్లు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. సింహపురి రుచులు, బిర్యానీ హౌస్, బాబు ఐస్ క్రీమ్స్, సాయి ఫుడ్ సెంటర్ తదితర హోటళ్ళపై రైడ్స్ చేశారు. కార్పోరేషన్ కమిషనర్ వీవీఎస్ మూర్తి, ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాసులు, కార్పోరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఈ రైడ్స్ చేపట్టారు. బిర్యానీ హౌస్ లో వంద కిలోల మాంసాన్ని గుర్తించిన అధికారులు... ఆ మాంసం కుళ్ళిపోయి వుండడం చూసి ఖంగుతిన్నారు. కుళ్ళిన మాంసం పనికి రాకుండా కెమికల్స్, ఫినాయిల్ పోశారు. అనంతరం వెంకట రమణ మీడియాతో మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు హోటల్స్ పై దాడులు చేశామన్నారు. పరిశుభ్రత పాటించని హోటళ్ళను సీజ్ చేయడంతో పాటు ఫైన్ వేశారు. హోటల్ యజమానులు శుభ్రత పాటించాలని, నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందిచని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
► Download NDN Android App:
► Like us on Facebook:
► Subscribe to NDN HD Live:
► Circle us on G+:
► Tweet NDN at :

nellore news,nellore local news,nellore news today,nellore live news,nellore hotels,

Post a Comment

0 Comments