అందరి కళ్లూ ఎదురు చూసేది...ఆ స్వామి దర్శనం కోసమే. జీవితంలో ఒక్కసారైనా కళ్లరా చూస్తే చాలు... జన్మ తరిస్తుందనే నమ్మకం శతాబ్దాలుగా భక్తకోటిని అటుగా నడిపిస్తోంది. ఏడు కొండలపైన వెలసినా....తిరుమల శ్రీవారి కోసం భక్తులు అనేక వ్యయప్రయాసలకు ఓర్చి తరలి వస్తుంటారు. అంతటి మహత్తు కలిగిన స్వామి.... ఏరికోరి కొలువైన తిరుగిరుల ప్రత్యేకత ఏంటి....?ప్రకృతి అందాలకు నెలవైన శేషాచల సోయగాల్ని కనులారా వీక్షిస్తున్నది ఎంతమంది? ప్రయాణ బడలికతోనో.... సమయాభావం వలనో తిరుమల తిరుపతి అందాల్ని ఆస్వాదించలేకపోతున్న వారి కోసం ఫోటోగ్రాఫర్‌గా మారాడు...ఆ యువకుడు. తనదైన ఫోటోగ్రఫీ ప్రతిభతో ఏడుకొండల్లోని సహజసిద్ధ అందాల్ని అందరికి పరిచయం చేస్తున్నాడు.
#YuvaEtv
#EtvAndhraPradesh
0 Comments